📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliఅదుపుతప్పి బోల్తాపడిన లారీ

అదుపుతప్పి బోల్తాపడిన లారీ

📰 Generate e-Paper Clip

అదుపుతప్పి బోల్తాపడిన లారీ

డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం.. స్వల్ప గాయాలు కూడా లేకుండా బయటపడిన వైనం

మన ప్రజావాణి – మంతిని ప్రతినిధి

రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలోని బస్టాండ్ మూలమలుపు వద్ద గురువారం అర్ధరాత్రి లారీ అదుపుతప్పి బోల్తాపడింది. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

టీఎస్ 25 టీ 6929 నంబర్ గల లారీ మల్లంపల్లి నుంచి ఎర్రమట్టిని దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీకి తరలిస్తుండగా చందనాపూర్ బస్టాండ్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ ఎస్. రాజుకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.