📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguఅంగరంగ వైభవంగా బోనాల సంబరాలు

అంగరంగ వైభవంగా బోనాల సంబరాలు

📰 Generate e-Paper Clip

.అమరావతి విద్యాలయంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు.

వెంకటాపుర్,రామప్ప (ప్రజావాణి)

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలోని అమరావతి విద్యాలయంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ వీరగాని రాజయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణ అంతా భక్తి శోభతో కళకళలాడింది.
విద్యార్థినులు సంప్రదాయ వస్త్రాలను ధరించి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పాటలతో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ప్రిన్సిపాల్ వీరగాని రాజయ్య మాట్లాడుతూ విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా పిల్లలకు నేర్పించడమే మా లక్ష్యం అని తెలిపారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను ఘనంగా నిర్వహించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.