📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadనెల్లికుదురు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా యాదవరెడ్డి

నెల్లికుదురు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా యాదవరెడ్డి

📰 Generate e-Paper Clip

నెల్లికుదురు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా యాదవరెడ్డి

ప్రజావాణి,నెల్లికుదురు:కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల శాఖ అధ్యక్షులుగా పార్వతమ్మ గూడెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డిని ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ డిసిసి అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. యాదవ రెడ్డి పార్టీ సీనియర్ నాయకునిగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో క్రమశిక్షణ కలిగిన నాయకునిగా ఎంతో కృషి చేశారు. నిరంతరం ప్రజలతో మమేకమై,ప్రజలకు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటూ కష్ట సుఖాలలో పాలుపంచుకుంటున్నారని మంచి పేరు ఉంది. డిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. దీంతో ఆయన సేవలను మరింత వినియోగించుకోవడానికి ఆ పార్టీ మండల అధ్యక్షునిగా యాదవ రెడ్డిని నియమించింది.

*అధ్యక్ష పదవితో మరింత బాధ్యత పెరిగింది..*
                                        యాదవ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా తనను నియమించడంతో పార్టీ అభివృద్ధిలో తన బాధ్యత మరింత పెరిగిందని నూతనంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా నియమితులైన యాదవ రెడ్డి అన్నారు.
తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతల్లో నియమించిన, సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్,మంత్రి సీతక్క,ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్, మాజీ డిసిసి అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి ల తోపాటు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.