📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్అంగన్వాడి టీచర్ & హెల్పర్ ఖాళీల దరఖాస్తుల జాబితా విడుదల

అంగన్వాడి టీచర్ & హెల్పర్ ఖాళీల దరఖాస్తుల జాబితా విడుదల

📰 Generate e-Paper Clip

అంగన్వాడి టీచర్ & హెల్పర్ ఖాళీల దరఖాస్తుల జాబితా విడుదల


.అభ్యంతరాలు ఉంటే 13-08-2026 లోపు తెలియజేయాలి.
. CDPO ప్రేమలత.

.తాడ్వాయి, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి).

ములుగు జిల్లా తాడ్వాయి ICDS, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ములుగు జిల్లా ద్వారా అంగన్వాడి టీచర్ మరియు హెల్పర్ ఖాళీల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల మొదటి దశ పరిశీలన పూర్తయింది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తం ఎంపిక చేయబడిన అర్హులు మరియు అనర్హుల జాబితాలను సంబంధిత గ్రామపంచాయతీల కార్యాలయాల నోటీసు బోర్డుల వద్ద ప్రదర్శించడం జరిగింది.కావున దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరూ తమ పేర్లను గ్రామపంచాయతీ కార్యాలయంలో పరిశీలించుకోవాలని కోరారు.జాబితాలోని సమాచారం పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తేదీ 13/08/2026 సాయంత్రం 5 గంటల లోపు ICDS CDPO, తాడ్వాయి కార్యాలయానికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించాలని CDPO E.P. ప్రేమల గారు తెలిపారు.
అందిన ఫిర్యాదులను పరిశీలించి తగు సమాధానం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
ఖాళీల భర్తీకి అందరూ సహకరించాలని, తదుపరి దశలో జరిగే ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ తేదీలను అర్హులకు స్వయంగా తెలియపరుస్తామని CDPO గారు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.