📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత ధ్వజ.గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో రెడ్యం సోదరులు.

శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత ధ్వజ.గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో రెడ్యం సోదరులు.

📰 Generate e-Paper Clip

మంగళవాయిద్యాలు,బాణసంచ మధ్య రెడ్యం సోదరులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.

రెడ్యం సోదరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదం అందించిన వేద పండితులు.

ఖాజీపేట జూలై 12 ప్రజావాణి పంచాయతీ,బుడ్డాయపల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ సమేత ధ్వజ.గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా,ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక,సాంప్రదాయ కార్యక్రమాలకు భక్తులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాముల వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.బుడ్డాయి పల్లె గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి,కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,వైయస్సార్ సిపి నేత,కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డిలు హాజరైనారు. వీరితో పాటు వైయస్సార్ సిపి,బీసీ విభాగం జిల్లా కార్యదర్శి బత్తల సుబ్బరాయుడు యాదవ్, వైయస్సార్ సిపి యువజన విభాగం మండల అధ్యక్షుడు ముత్తూరు రమణ,వైయస్సార్ సిపి నేతలు మాజీ సర్పంచ్ తప్పెట చంద్ర,రెడ్యం నాగేశ్వర్ రెడ్డి,సానేపల్లె సుబ్బారెడ్డి,ఏనుగు బాలసుబ్బారెడ్డి,కడప గురు ప్రసాద్,సారే రంగయ్య,గంగిరెడ్డి సుదర్శన్ రెడ్డి పలువురు హాజరైనారు.వారందరినీ బుడ్డాయ పల్లె గ్రామ పెద్దలు, ప్రజలు మంగళ వాయిద్యాలు,బాణసంచా పేలుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు.గ్రామంలోని గుడి ప్రాంగణం లోకి చేరుకున్న రెడ్యం సోదరులు,వైయస్సార్ సిపి నేతలకు అర్చకులు,వేద పండితులు, గ్రామ పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రెడ్యం సోదరులు ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి సిమెంట్,కంకర స్వయంగా వేయడంతో పాటు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.అనంతరం శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ,గంగమ్మ, పోతురాజు స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం…రెడ్యం సోదరులతో పాటు వారి వెంట వచ్చిన వారందరికీ వేద పండితులు,అర్చకులు, గ్రామపెద్దల పూల మాలలు,కండువాలు వేసి ఘనంగా సత్కరించారు.పండితులు వారందరికీ తీర్థ, ప్రసాదాలు అందించి అక్షింతలు చల్లి వేద ఆశీర్వాదం చేశారు.కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులు, భక్తులకు రెడ్యం సోదరులు పలకరించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని.తమను ఆప్యాయంగా పలకరించి,ఘన స్వాగతం పలికి,సత్కరించిన గ్రామ పెద్దలకు,ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ప్రజలు యెన్నం శోభన్ బాబు,కొత్తపల్లి ఓబన్న,కొత్తపల్లి చిన్న ఓబులేసు, జక్కల శేఖర్,దాసరి వెంకటసుబ్బయ్య,ఓబులపు నాగేశ్వరరావు,ఇనాం డేవిడ్ కుమార్,అల్లూరు ఓబులేసు, కొత్తపల్లె పెద్ద ఓబులేసు,ఓబులపు చిన్న చెన్నయ్య,ఓబులపు గుల్లి చెన్నయ్య,ఓబులపు చండ్రాయుడు, దాసరి రమణయ్య పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.