📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialవెల్గటూర్ మండల RMP, PMP అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

వెల్గటూర్ మండల RMP, PMP అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ జులై 26 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల RMP, PMP అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా కమిటీ అధ్యక్షులు కుసుమ శంకర్ తదితర ప్రతినిధుల పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎన్నికలో వెల్గటూర్ మండలం నూతన అధ్యక్షునిగా జగదేవ్ పేట గ్రామానికి చెందిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి ఏకగ్రీవంగా నియామకం కాగా, ప్రధాన కార్యదర్శిగా కిషన్ రావు పేటకు చెందిన చట్టుపల్లి గంగాధర్, కోశాధికారిగా సంకెనపెల్లి కి చెందిన మోకెనపల్లి సతీష్ లను సంఘ సభ్యులందరి పూర్తి ఆమోదంతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… తమపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుండి పోరాడతామని, సంఘ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమ అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్గటూరు మండల గ్రామీణ వైద్యులు, జిల్లా కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.