EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriవిద్యుత్ సరఫరా అంతరాయం

విద్యుత్ సరఫరా అంతరాయం

📰 Generate e-Paper Clip

పోచారం, జూలై 28 (ప్రజావాణి): సింగపూర్ టౌన్‌షిప్ సబ్‌స్టేషన్ నుంచి పోచారం సబ్‌స్టేషన్‌కు 33 కేవీ విద్యుత్ లైన్ అనుసంధానంలో భాగంగా 10 స్పాన్లలో స్ట్రింగింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూలై 29 (బుధవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ తెలిపారు.

సింగపూర్ ఫేజ్–1 ఫీడర్ పరిధిలోని సింగపూర్ టౌన్‌షిప్ డి–2, డి–3, డి–4, సి–1, సి–2, సి–3 బ్లాక్‌లు, అలాగే ఏ–24 నుంచి ఏ–35…. సింగపూర్ ఫేజ్–2 పరిధిలోని ఏ–1 నుంచి ఏ–6 వరకు, ఏ–12 నుంచి ఏ–21 వరకు, ఏ–36 నుంచి ఏ–50 వరకు, సి–4 నుంచి సి–10 బ్లాక్‌లు, పల్లవి పాఠశాల పరిసర ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా అంతరాయం ఉండనుంది.

విద్యుత్ సరఫరా నిలిపివేసే సమయంలో వినియోగదారులు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.