📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaమల్లాపూర్ గ్రామం లో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ మరియు రేణుకాఎల్లమ్మబోనాలు

మల్లాపూర్ గ్రామం లో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ మరియు రేణుకాఎల్లమ్మబోనాలు

📰 Generate e-Paper Clip

**మల్లాపూర్ గ్రామం లో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ మరియు రేణుకాఎల్లమ్మబోనాలు.*


తంగళ్ళపెల్లి/ప్రజావాణి*

తంగళ్ళపెల్లి మండలం
మల్లాపూర్ గ్రామం లో పోచమ్మ బోనాలు మరియు ఎల్లమ్మ బోనాలు గణంగా నిర్వహించారు
అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ & ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను  బుధవారం రోజున భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పోచమ్మ తల్లి భవనాన్ని కొత్తగా నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు ఊరేగింపుగా వెళ్లి  తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనాలతో వెళ్ళి ప్రత్యేకపూజలునిర్వహించారు.ఈ వేడుకల్లో గ్రామం లో వివిధ సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జవిజయవంతం చేశారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలు, సమృద్ధిగా వర్షాలు కురవాలని పోచమ్మ & ఎల్లమ్మ తల్లిని ప్రార్థించారు. ఉత్సవాలు భక్తిపారవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిశాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.