📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliమందుబాబులకు అడ్డాగా సుందిల్ల ఐకేపీ కేంద్రం...? మద్యం మత్తులో వాహనాల దూకుడుతో పెరుగుతున్న ప్రమాదాలు

మందుబాబులకు అడ్డాగా సుందిల్ల ఐకేపీ కేంద్రం…? మద్యం మత్తులో వాహనాల దూకుడుతో పెరుగుతున్న ప్రమాదాలు

📰 Generate e-Paper Clip

మందుబాబులకు అడ్డాగా సుందిల్ల ఐకేపీ కేంద్రం…?
-మద్యం మత్తులో వాహనాల దూకుడుతో పెరుగుతున్న ప్రమాదాలు.
-పీసీ పటేల్ కంపెనీ కార్మికులపైకి దూసుకెళ్లిన వాహనం.
-పోలీసుల నిఘా పెంచాలని గ్రామస్థులు,కార్మికుల విజ్ఞప్తి.

రామగిరి, మన సమగ్ర ప్రజావాణి జూలై 30



రామగిరి మండలం గోదావరిఖని నుండి మంథని కి వెళ్ళే రహదారి సుందిల్ల గ్రామం ఐకేపీ కేంద్రం పరిసరాలు రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు గ్రామస్థులు, కార్మికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా బుధవారం రాత్రి పీసీ పటేల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులపైకి ఓ వాహనం అదుపుతప్పి దూసుకెళ్లిన ఘటనలో పలువురు కార్మికులు గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా,ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
గ్రామస్థుల కథనం ప్రకారం, ఐకేపీ కేంద్రం వద్ద రాత్రివేళల్లో మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతుండటంతో స్థానికులు,ఉద్యోగులు, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే కార్మికులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంటోందని వాపోతున్నారు.ఈ నేపథ్యంలో ఐకేపీ కేంద్రం పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి,మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, కార్మికులు కోరుతున్నారు. అలాగే తరచూ వాహన తనిఖీలు నిర్వహించి ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.