📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadకాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చన్న ఇకలేరు పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే మురళి నాయక్

కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చన్న ఇకలేరు పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే మురళి నాయక్

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి”లచ్చన్న”ఇక లేరు
పార్టీకి తీరని లోటు:ఎమ్మెల్యే మురళీ నాయక్

ప్రజావాణి,నెల్లికుదురు:కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి బుధవారం భువిని వీడి శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం పాటుపడిన లక్ష్మారెడ్డి అనారోగ్య కారణంతో అస్తమయం చెంది ఇక లేరు అనే వార్త జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను కలచివేస్తోంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిని ఆ గ్రామస్తులతోపాటు మండల జిల్లా వ్యాప్తంగా అందరూ “లచ్చన్న” అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన స్వగ్రామం రామన్నగూడెం తో పాటు మండల వ్యాప్తంగా పార్టీలకతీతంగా అందరితో కలివిడిగా ఉంటూ సహకారం అందించేవాడు.ఎమ్మెల్యే డా. మురళి నగర్ తో పాటు కాంగ్రెస్ పెద్దలతో లచ్చన్నకు సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ నాయకులు కార్యకర్తలకు ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు వారి దృష్టికి వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేసేవాడని మంచి పేరుంది. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల తోపాటు ఏ ఎలక్షన్లు వచ్చినప్పటికీ పార్టీ అభ్యర్థుల విజయం కోసం అంకితభావం కృషి చేసేవాడు.

*కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు:ఎమ్మెల్యే..*
*లచ్చన్న పాడె మోసిన మురళీనాయక్*

లక్ష్మారెడ్డి కన్నుమూశాడనే సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్, డిసిసి జిల్లా అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్ తో పాటు సీనియర్ నేత జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ప్రభృతులు హుటాహుటిన రామన్నగూడెం చేరుకొని లచ్చన్న పార్థివదేకదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళుల ర్పించారు.భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మారెడ్డి అందరివానిగా మసులుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశాడని కొనియాడారు. ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహాప్రస్థాన యాత్రలో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాడెమోశారు. కాంగ్రెస్ నేతలు ప్రభాకర్ గౌడ్,యాదవ రెడ్డి, సత్యపాల్ రెడ్డి,బాలాజీ నాయక్,బైరు అశోక్ గౌడ్,రంజిత్ రెడ్డి,గుట్టయ్య గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, నెల్లికుదురు మండలం తో పాటు పలు మండలాల పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాల వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు లక్ష్మారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.