📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialఫామ్ హౌస్ కు ఏజెన్సీ యాక్ట్ వర్తించదా

ఫామ్ హౌస్ కు ఏజెన్సీ యాక్ట్ వర్తించదా

📰 Generate e-Paper Clip

*ఫామ్ హౌస్ కు ఏజెన్సీ యాక్ట్ వర్తించదా..?*

*బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్*

* *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 7

మందమర్రి శివారు మున్సిపాలిటీ పరిధిలోని సీలింగ్ పట్టాభూమిలో నిర్మిస్తున్న ఫామ్ హౌస్ కు ఏజెన్సీ యాక్ట్ వర్తించదా అని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఫామ్ హౌస్ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో మండల తహశీల్దార్ సతీష్ కుమార్ కు బిఎస్పీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, మందమర్రి శివారు మున్సిపాలిటీ పరిధిలోని సీలింగ్ పట్టా భూమి సర్వే నెంబర్ 347/2లో గల మూడెకల 20 గుంటల భూమిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, వన్ బై సెవెంటీ యాక్ట్ హనుమాన్ లో ఉన్నప్పటికీ ఫార్మ్ హౌస్ నిర్మాణం జరుగుతుందని ఆరోపించారు. ఆ భూమి యజమాని బూనేని రాజు ఆ భూమిని ఇతర కమ్యూనిటీ వ్యక్తికి విక్రయించాడని, ఆ వ్యక్తి ఆ భూమిలో ఫాం హౌస్ నిర్మిస్తున్నాడని తెలిపారు. ఆ సీలింగ్ పట్టాను రద్దుచేసి, భూమిని స్వాధీన పరుచుకొని, పట్టణంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, ఉపాధ్యక్షుడు మతిన్ ఖాన్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గోమాస బ్రహ్మానందం లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.