📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు పండ్లు పంపిణీ

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు పండ్లు పంపిణీ

📰 Generate e-Paper Clip

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు, పండ్లు పంపిణీ.
కోదాడ, జూలై 04/ ప్రజావాణి


కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లో ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గం ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రం మరియు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉర్దూ మీడియం విద్యార్థులకు శనివారం స్టీల్ గ్లాసులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బత్తిని కృష్ణమూర్తి సూర్యాపేట జిల్లా జర్నలిస్టు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే పండ్లు, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేసే స్టీల్ లేదా గాజు గ్లాసులను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం అంజి మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులకు అవసరమైన సేవలు అందించడంలో ప్రెస్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బాణాల అబ్రహం, ప్రధాన కార్యదర్శి బి నాగరాజు, కోశాధికారి షేక్ నూరుద్దీన్, జగన్, వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.