📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅధికారుల అవినీతితో బోడుప్పల్ సుద్దకుంట చెరువు మాయం

అధికారుల అవినీతితో బోడుప్పల్ సుద్దకుంట చెరువు మాయం

📰 Generate e-Paper Clip

అధికారుల అవినీతితో బోడుప్పల్ సుద్దకుంట చెరువు మాయం

అఖిలపక్షకమిటి చైర్మన్ ఎల్లగోని బాలరాజ్ గౌడ్ ధ్వజం

సుద్దకుంట ఎఫ్ టి ఎల్ లో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన అఖిలపక్ష కమిటీ నేతలు

మేడిపల్లి జులై  04 (మన ప్రజావాణి) అధికారుల విచ్చలవిడి అవినీతి వల్ల బోడుప్పల్లోని సుద్దకుంట చెరువు పూర్తిగా మాయ మవుతోందని బోడుప్పల్ సర్కిల్ అఖిల పక్షకమిటి చైర్మన్ ఎల్లగోని బాలరాజ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అఖిలపక్ష కమిటి నేతలతో కలసి ఆయన సుద్దకుంట చెరువు ప్రాంతంలో నింబధనల కిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకుల అండదండలతో చెరువులు,కుంటలు ఆక్రమణకు గురవుతు న్నాయని వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితం అధికారులు ఏర్పాటు చేసిన ఎఫ్ టిఎల్,బఫర్ హద్దు రాళ్లను సైతం తొలగించి నిర్మాణాలను ప్రోత్స హిస్తున్నారన్నారు.ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వని అధికారులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ నిర్మాణాలకు దొడ్డిదారిన అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటని బాలరాజ్ ప్రశ్నించారు.
రికార్డుల ప్రకారం ఆరు ఎకరాల 35 గుంటలు ఉండాల్సిన నేడు మూడు ఎకరాలు కూడా లేదని, సుద్దకుంట చెరువు బఫర్ జోన్.ఎఫ్ టిఎల్ పరిధిలో మొత్తం కబ్జాలతో కనుమ రుగవుతోందని,కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతోనే సుద్దకుంట చెరువు సమీపంలో విచ్చలవిడిగా ఆక్రమణల పర్వం కొనసాగుతోందని ఆరో పించారు.గతంలో ఇక్కడ నిర్మాణాలను కూల్చిన అధికారులు మళ్లీ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని బాలరాజ్ I ప్రశ్నించారు.ప్రస్తుతం జరుగుతున్న కబ్జాలను అడ్డుకోకపోతే కట్టకూడా మాయమవుతుందని,దీనిపై అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరముందన్నారు. సుద్దకుంటలో జరుగుతున్న భూకబ్జాలపై అఖిల పక్ష కమిటీ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాలరాజ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటి ప్రతినిధులు రాపోలు శంకరయ్య,కామగల్ల నర్సింహ్మా,బద్దుల సత్యనారాయణ యాదవ్, సాయిని అమృతం, తూర్పాటి యాదయ్య, ఏనుగు లక్ష్మయ్య,చీరాల జంగయ్య,బోడగళ్ల సదానంద్,హరినాథ్ గౌడ్, రాపోలు రామస్వామి, చంటి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.