📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriపోచారం డివిజన్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: కర్రే రాజేష్

పోచారం డివిజన్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: కర్రే రాజేష్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 10: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశం చౌదరిగూడలో ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రే రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా కర్రే రాజేష్ మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త సమస్య తన సమస్యేనని పేర్కొన్నారు. డివిజన్‌లోని ప్రతి గ్రామాన్ని సందర్శించి కార్యకర్తలు, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నెల రోజుల్లో మరోసారి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు సుధీర్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఇంటికి చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో కుటుంబ పాలన కొనసాగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పోచారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగరేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఘట్‌కేసర్ మండల మాజీ వైస్ చైర్మన్ కర్రే జంగమ్మ, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు వినోద్ కుమార్, పోచారం జిల్లా కార్యదర్శి ఇటికల కృష్ణారెడ్డి, పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు బద్దం నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు, పోచారం మున్సిపల్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్ర మాధవి రాజు, మాజీ ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.