📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguపెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వేయి స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు

పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వేయి స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వేయి స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు

బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు భూక్య జంపన్న గారి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు.

ములుగు ,జూలై 29(ప్రజావాణి)

ఇటీవల గుండెపోటుకు గురై సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ హనుమకొండలోని చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న ఆధ్వర్యంలో పూజా . ఆలయ అర్చకుల తో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా భూక్య జంపన్న మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన నాయకుడని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడి మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ధైర్యంగా ఉండాలని, అందరి ఆశీస్సులు, ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పూజా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు పెద్ది సుదర్శన్ రెడ్డి దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ తీర్థప్రసాదాలను స్వీకరించరు.
ఈ కార్యక్రమంలో నాతోపాటు జన్ను రాంబాబు గారు, మోహన్ గారు, రాజేష్ గారు, నవీన్ గారు, ఉమేష్ గారు, శ్రీనివాస్ గారు, రాజుగారు, ప్రశాంత్ గారు, సంతోష్ గారు, నగేష్ గారు, సుందిలా సంతోష్ గారు, దుర్గం నగేష్ గారు, కావేరి సిద్ధార్థ గారు, శ్రీమంతు గారు, రాజేష్ గారు, కొండ గొర్ల దీపక్ గారు, సును కాని రణదీర్ గారు గోగుల సంతోష్ గారు, విజయ్ రెడ్డి గారు, విజయ్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.

బై రిపోర్టర్‌ గొల్లపెల్లి శ్రీకాంత్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.