పందుల గుంపు అడ్డంగా వచ్చి బైక్ ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు
చెన్నారావుపేట జూలై 20 ప్రజావాణి

నర్సంపేట నుంచి కేసముద్రం వెళ్తున్న ఆముదారపు మల్లయ్య (50) ద్విచక్ర వాహనాన్ని చెన్నారావుపేట శివారులో సోమవారం పందుల గుంపు అకస్మాత్తుగా అడ్డంగా వచ్చి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా, సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది నాగరాజు, ప్రవీణ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

