📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamనిబంధనలు తుంగలో తొక్కి భూమి అభివృద్ధి ఆట

నిబంధనలు తుంగలో తొక్కి భూమి అభివృద్ధి ఆట

📰 Generate e-Paper Clip

నిబంధనలు తుంగలో తొక్కి భూమి అభివృద్ధి అట..?


ఎటువంటి అనుమతులు లేకుండా రాళ్లు తరలింపు..!

*భూమి అభివృద్ధి అయినా… కళ్యాణ మండపమైన అనుమతులతో పని లేదా..?


*విచారణ చేసి చర్యలు తీసుకుంటాం

ముదిగొండ తహసీల్దార్ రవికుమార్ వివరణ

ముదిగొండ అయ్యగారి పల్లిలో ఓ గురువు డైరెక్షన్లో కొనసాగుతున్న వ్యవహారం..?

మన ప్రజావాణి ప్రత్యేక కథనం..!


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


అర్ధబలం అంగబలం పరపతి పలుకుబడి పెట్టుబడిగా ఎటువంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిని చదును చేస్తున్నామంటూ వాగు ముప్పు నుండి కాపాడుకునేందుకు ప్రయత్నం అంటూ నిర్వాహకుల సమాధానాలు కానీ వాగు వంకలు ఏరు లాంటి ప్రదేశాలలో బఫర్ జోన్లు ఎఫ్ టి ఎల్ జోన్లు ఉంటాయని సదరు గురువుకు తెలిసినప్పటికీ పట్టా భూమిలో డెవలప్మెంట్ చేస్తున్నాం రాళ్ళను ఓ అభివృద్ధి పథకం వద్ద నుండి అది కూడా గుట్ట నుండి తీసుకువచ్చి గుంటలు పెట్టి రాళ్లను లోపల వేసి మట్టి వేస్తున్నాం అంటూ సమాధానం పట్ల స్థానికులు పలువురు మండల ప్రజలు అసహనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా ముదిగొండ వల్లభి ప్రధాన రహదారిలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారంపై పలువురు స్థానికులు మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. కాగా ప్రభుత్వ నిబంధనలను పరిశీలిస్తే భూమి చదును చేయడం సాధారణ వ్యవసాయం లేదా ఇండ్ల నిర్మాణం కోసం స్వల్పంగా మట్టిని సర్దుబాటు చేసుకోవడం మినహా భారీ ఎత్తున మట్టిని లేదా రాళ్ళను బయటికి తీయడం లేదా గుంటలో చేసి రాళ్లను తరలించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని కొందరు అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రధానంగా గ్రానైట్ ఇసుక కంకర గ్రావెల్ వంటి తవ్వ సంబంధిత రెవిన్యూ మైన్స్ భూగర్భ జలాల శాఖ నుంచి లీజు లేదా పర్మిట్ పొందాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఓ గురువు డైరెక్షన్లో కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా సొంత భూమిలో తవ్వకాలు జరి పితే అధికారులు జరిమానా విధించడంతోపాటు వాహనాలు యంత్రాలను లీ జ్ చేసే అవకాశం ఉందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని తెలుస్తోంది. పైగా ఓ అభివృద్ధి పథకం పనులు దగ్గర ఓ గుట్ట నుండి రాళ్లను అనుమతులు తీసుకోని తరలిస్తున్నాం అంటూ సదరు నిర్వాహకులు ఎదురు ప్రశ్నించడం విశేషం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారి పల్లి గ్రామ సమీపంలో వాగు వద్ద ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ విషయంపై జిపిఓను మన ప్రజావాణి ప్రతినిధి సంప్రదించగా అనుమతులు లేవని ఈ విషయాన్ని ఇన్చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ తహసీల్దారు దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. సమీపంలోని ఓ ప్రాంతం నుండి రాళ్లను తరలిస్తున్నారని అని సమాధానం ఇవ్వగా పైన రాళ్లు కింద మట్టిని పేర్చి తరలిస్తున్నట్లు ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఇదే విషయంపై స్థానిక ముదిగొండ తాహసిల్దార్ రవికుమార్ స్పందిస్తూ జిపిఓ దృష్టికి తీసుకు వచ్చినట్లు అంతకుముందు ఏమైనా అనుమతులు ఉన్నాయా అని పరిశీలిస్తా ఇప్పుడు మాత్రం ఎటువంటి అనుమతులు లేవు అంటూ అన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు.

*మరికొన్ని సమగ్ర వివరాలతో.. రేపటి కథనం 2లో…!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.