📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనారపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ.... డీసీసీ అధ్యక్షుడు...

నారపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ…. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూలై 15: ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ నారపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, బైండ్ల జంగయ్య, ఇటికాల కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, మెట్టు వెంకటేష్ గౌడ్, గణేష్ యాదవ్, సహదేవ్ గౌడ్, భోజిరెడ్డి, నర్సింగ్ రావు, అంజన్ గౌడ్, బద్రి, మల్లికార్జున్, వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి రాజు, ఎండి నవాబ్, ఎర్ర రాజు, సయ్యద్ జాఫర్, షబ్బీర్, నవాజ్, మోటుపల్లి వెంకటేష్, మహేందర్, ఉమర్, శ్రావణ్ కుమార్, సంతోష్ కుమార్, రఫిక్తో పాటు మహిళా నాయకురాళ్లు లక్ష్మి, గౌరీ, గౌతమి, భవాని, జయలక్ష్మి, తులసి మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.