📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyటీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

రామచంద్రపురం, జూలై 9 (ప్రజావాణి):తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా రూమాండ్ల అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడిగా వరుసగా రెండోసారి శ్రీనాథ్, జిల్లా సంయుక్త కార్యదర్శిగా కే. శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన బాధ్యులు తమపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. పైసల్‌తో పాటు సంగారెడ్డి జిల్లా జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, అందరినీ కలుపుకొని యూనియన్‌ను మరింత బలోపేతం చేసి, జర్నలిస్టుల గౌరవాన్ని పెంపొందించే దిశగా అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.