📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్టిడిపి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా?: పోరుమామిళ్ల మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్, ఉప సర్పంచ్ ...

టిడిపి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా?: పోరుమామిళ్ల మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్, ఉప సర్పంచ్  రాళ్లపల్లి రవి ధ్వజం

📰 Generate e-Paper Clip

* పంటలు ఎండిపోతుంటే చేపల కాంట్రాక్టర్ల కోసం నీటిని వదులుతారా?
* అధికారులు కాంట్రాక్టర్లుగా మారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు.
* వైసిపి హయాంలో జరిగిన అభివృద్ధిని టిడిపి నిర్వీర్యం చేస్తోంది.
* త్వరలోనే సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.

పోరుమామిళ్ల,జూలై 13 ప్రజావాణి కూటమి ప్రభుత్వంలో అన్నదాతల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని,తెలుగుదేశం పార్టీకి రైతుల గోడు అసలు పట్టడం లేదని పోరుమామిళ్ల మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్,ఉప సర్పంచ్, వైసిపి సీనియర్ నాయకులు రాళ్లపల్లి రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సోమవారం ఆయన పోరుమామిళ్లలో విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఆయకట్టు రైతుల సమస్యలపై అధికారుల తీరును,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.ఈ సందర్భంగా రాళ్లపల్లి రవి మాట్లాడుతూ,పోరుమామిళ్ల చెరువు కింద దాదాపు 5 వేల ఎకరాల్లో రైతులు నమ్ముకుని వరి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు.ఈ ఏడాది కూడా సకాలంలో నాట్లు వేశారని గుర్తు చేశారు.ప్రస్తుతం సరైన వర్షాలు లేని పరిస్థితుల్లో,పోరుమామిళ్ల చెరువు నుండి నీటిని నిలకడగా వాడుకుంటే దాదాపు మూడు నెలల పాటు పంటకు నీరందించే అవకాశం ఉందన్నారు.అలాంటిది కేవలం 20 రోజుల్లోనే పోరుమామిళ్ల చెరువు నుండి రంగసముద్రం చెరువునకు నీటిని ఎందుకు విడుదల చేశారని ఆయన అధికారులను నిలదీశారు.దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.స్థానిక అధికారులు ప్రజాసేవను విస్మరించి,కాంట్రాక్టర్లుగా మారిపోయారని ఆయన ఆరోపించారు.రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి,కేవలం చేపల కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే చెరువులోని నీటిని అనవసరంగా వృధాగా వదిలేస్తున్నారని మండిపడ్డారు.అధికారుల స్వార్థపూరిత చర్యల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని,సాగు నీరు అందక ఆయకట్టు రైతుల పొట్ట కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని,ఆదర్శవంతమైన రీతిలో గంగనపల్లి చెరువు నుండి వరికుంట్ల చెరువుకు పైపుల ద్వారా నీటి సౌకర్యం కల్పించి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా.గంగనపల్లె, వరికుంట్ల పరివాహక ప్రాంత రైతుల నీటి సౌకర్యం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు.అంతేకాకుండా,కలసపాడు మండలం తెల్లపాడులో గతంలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని రవి విమర్శించారు.కనీసం త్రాగునీరు కూడా అందక వరికుంట్ల ప్రజలు అల్లాడిపోతున్నారని,మంచినీటి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నా పాలకులు కనికరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతాంగాన్ని,ప్రజలను వేధిస్తున్న ఈ తీవ్రమైన సమస్యలపై త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి,న్యాయం జరిగే వరకు పోరాడుతామని రాళ్లపల్లి రవి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.