📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarజర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

📰 Generate e-Paper Clip

జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

డిపో మేనేజర్ కు వినతి పత్రం



* టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహన్ ఏ బూ సి సంపత్

జమ్మికుంట జూలై 10 (ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ హుజురాబాద్ డిపో మేనేజర్ కు  టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారుఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహాన్, ఏ బూసి సంపత్ లు మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలు ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ ప్రజల కోసం తీసుకొస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడంలో జర్నలిస్టుల ప్రాత్ర కీలకమని అన్నారు. మా యొక్క జర్నలిస్టులకు ఆర్టీసీ సంస్థ చాలా ఏళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో 1/3 రాయితీ పై ప్రయాణ సదుపాయం అమలు చేస్తున్నందుకు ఆర్టీసీ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత కొంతకాలంగా 1/3 చార్జీలు అంటూనే దాదాపు 50 శాతం చార్జీలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల జర్నలిస్టులకు అధిక భారం అవుతుందని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి జర్నలిస్టులు వార్తల సేకరణకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వార్తలు సేకరించడం వలన చార్జీల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ మా జర్నలిస్టులకు కూడా  ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. భూపతి సంతోష్, జిల్లా కమిటీ నాయకులు దొడ్డే రాజేంద్రప్రసాద్, ఎండి కాజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.