📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyచెర్కుపల్లి గ్రామానికి విద్యుత్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చెర్కుపల్లి గ్రామానికి విద్యుత్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📰 Generate e-Paper Clip

చెర్కుపల్లి గ్రామానికి విద్యుత్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కే. పురుషోత్తం రెడ్డి

నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

విద్యుత్ లైన్ల పరిశీలన చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి

కొందుర్గు మండల పరిధిలోని చెర్కుపల్లి గ్రామంలో దీర్ఘకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందనీ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవతో గ్రామానికి నూతన సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరై ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు పూర్తయ్యాయనీ కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కే. పురుషోత్తం రెడ్డి
అన్నారు. ఈ సందర్భంగా నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించి, విద్యుత్ లైన్లను మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి పరిశీలించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగూరి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో చాలాకాలంగా ఉన్న లో-వోల్టేజ్ సమస్యకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, విద్యుత్ లైన్ మార్పిడి పనుల వల్ల ఇకపై గ్రామానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించడం ఎమ్మెల్యే ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ యాదయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు నర్సింలు, మల్లయ్య, శశికుమార్, గుడి కమిటీ చైర్మన్ జీవన్, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు కుమార్, వెంకటేష్, శ్రీకాంత్, శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక సర్పంచ్ యాదయ్య మాట్లాడుతూ, గ్రామ విద్యుత్ సమస్యలను పరిష్కరించి నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.