📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ రెండో సంస్థాపన వేడుక 

ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ రెండో సంస్థాపన వేడుక 

📰 Generate e-Paper Clip

 

ఘట్‌కేసర్, జూలై 16: సమాజ సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ సభ్యులు మరింత చురుకుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కె. గోవిందరాజ్ పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌లోని నారాయణ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ రెండో సంస్థాపన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు. సంస్థాపన అధికారిగా లయన్ రమేష్ లక్ష్మణ్, ఇండక్షన్ అధికారిగా లయన్ డాక్టర్ జైన్ రమేష్ వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా లయన్ రేసు లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా లయన్ బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, కోశాధికారిగా లయన్ డాక్టర్ వేల్పుల రవికుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.

క్లబ్ ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని అతిథులు సూచించారు. సమాజ అభ్యున్నతికి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్ మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, లయన్ సభ్యులు సార శ్రీనివాస్ గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్, మారం లక్ష్మారెడ్డి, డాక్టర్ మొలుగురం జంగయ్య, అల్లు కమలాకర్, బజాజ్, వేముల నాదం గౌడ్, సారా మురళి గౌడ్, లంబ సత్యనారాయణ యాదవ్, సన్నిధి ప్రసాద్, మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శారద, నర్సింగ్ రావు, ప్రమోద్, రాఘవేందర్, రామ్మోహన్, హిమబిందు, లక్ష్మి, మాధవి, రవీందర్, మమతా శర్మ, జి. రవి, సారా రాజు, రాజ్‌కుమార్, సంతోష్, స్థిత, బాల్‌రాజ్, నాంపల్లి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.