📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

*ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు*

* *మన ప్రజావాణి* మందమర్రి/మందమర్రి రూరల్:- జూలై 24

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి, విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కేటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని ఆదిల్ పేట్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా ఏరియాలోని పలు గనులు, విభాగాలలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ ఆధ్వర్యంలో టిబిజికెఎస్ శ్రేణులు మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ టిబిజికేఎస్ నాయకులు మాట్లాడుతూ, ముందుగా కేటీఆర్ కు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చేలా కేసిఆర్ నేతృత్వంలో ఆయన తనయుడు కేటీఆర్ పోరాట నిర్వహించారని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను దేశం గర్వించే విధంగా అభివృద్ధి పథంలో తీసుకోవడంలో కేటిఆర్ కృషి ఎనలేనిదని కొనియాడారు. ఐటీ రంగంలో సైతం తనదైన ముద్ర వేస్తూ, రాష్ట్రాన్ని బటి రంగంలో మేటిగా తీర్చిదిద్దడంలో కేటిఆర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఐటీ రంగ విస్తరణతో రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించాయన్నారు. కేటీఆర్ సేవలను ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రశంసించాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన*

ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అణిచివేతకు, దమనకాండకు నిరసనగా బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చేపట్టిన ధర్నాకు మద్దతు తెలుపుతూ, బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్, టిబిజికేఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల కండువాలు ధరించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.