📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘనంగా కందుల నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కందుల నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు 

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 4(ప్రజావాణి): పోచారం వెంకటాపురం బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కందుల నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.

ఎమ్మెల్యే మల్లారెడ్డి, శ్యామల సందీప్ రెడ్డి, నీరుడి శ్రీనివాస్, బుర్ర వెంకటేష్ గౌడ్, కొండల్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొని కందుల నవీన్ కుమార్‌తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా ఎల్‌బీ నగర్ ప్రాంతంలో సుమారు 50 మంది అవసరమైన వారికి ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. జన్మదిన వేడుకలను సామాజిక సేవతో ముడిపెట్టి నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కందుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, తన జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి, శ్యామల సందీప్ రెడ్డికి, నాయకులు, కార్యకర్తలు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.