📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్‌కేసర్ 6వ డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్

ఘట్‌కేసర్ 6వ డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 22: ఘట్‌కేసర్ 6వ డివిజన్ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఘట్‌కేసర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. బాల్యం నుంచే హిందుత్వ భావజాలంతో పాటు గోరక్షణ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న అనిల్ గౌడ్, ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు పలు హిందూ సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.

గత ఐదేళ్లుగా ఘట్‌కేసర్ మున్సిపల్ బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా సేవలందించిన ఆయన పార్టీ బలోపేతం, యువతను పార్టీ వైపు ఆకర్షించడం, సేవా కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం 6వ డివిజన్ బీజేవైఎం అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సూర్వి అనిల్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో యువ మోర్చా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.