📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadగడ్డి మందు విక్రయం పై కలెక్టర్ కు ఫిర్యాదు..శరత్ ఫెర్టిలైజర్ షాపును విసిట్ చేసిన ఏడిఏఅమ్మకాలు...

గడ్డి మందు విక్రయం పై కలెక్టర్ కు ఫిర్యాదు..
శరత్ ఫెర్టిలైజర్ షాపును విసిట్ చేసిన ఏడిఏ
అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశం

📰 Generate e-Paper Clip

గడ్డి మందు విక్రయం పై కలెక్టర్ కు ఫిర్యాదు..
శరత్ ఫెర్టిలైజర్ షాపును విసిట్ చేసిన ఏడిఏ
అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశం

ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నర్సింహుల గూడెం బస్ స్టేజి సమీపంలోని శరత్ పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ షాపులోని పురుగుల మందులను తాత్కాలికంగా అమ్మకాలను నిషేధించినట్లు ఏడిఏ శ్రీనివాసరావు, చిర్ర రమేష్ బాబులు తెలిపారు. నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన సిద్ధబోయిన నవీన్ ఈనెల 27న గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతిని భార్య సౌజన్య ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందును నరసింహుల గూడెం స్టేజి సమీపంలోని శరత్ ఫర్టిలైజర్ షాపు వారు తన భర్త నవీన్ కు అక్రమంగా విక్రయించార ని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. క్షణికావేశంలో సంబంధిత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు,ఎస్సై చిర్ర రమేష్ బాబు, మండల వ్యవసాయాధికారి భూక్య మహేందర్, ఏ ఈ ఓ మణికంఠ శరత్ ఫర్టిలైజర్ షాపును సందర్శించి విసిట్ చేశారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ షాపులోని స్టాకు తో పాటు గోడౌన్ ను తనిఖీ చేశామన్నారు. పెస్టిసైడ్స్ కు చెందిన స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేయకపోవడంతో షాపులోని పురుగుమందుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపి వేయడానికి ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం నివేదిక ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.