📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కడప ఎస్ఎఫ్ఐ నూతన నగర కమిటీ ఎన్నిక.

కడప ఎస్ఎఫ్ఐ నూతన నగర కమిటీ ఎన్నిక.

📰 Generate e-Paper Clip

కడప జూలై 16 ప్రజావాణి నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో కడప నగర నూతన కమిటీ నీ ఎన్నుకోవడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి అన్నారు. ఆంధ్ర రాష్ట్రం లోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ నూతన నగర కమిటీ ఎన్నుకోవడం జరిగిందని వారు అన్నారు. రాష్ట్రంలో ఉన్న రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీవో నెంబర్ 77 ను రద్దు చేసి ప్రైవేట్ ఏయిడెడ్ విద్యాసంస్థల పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ కల్పించే విధంగా జీవోను రద్దు చేయాలి విద్యార్థులకు ఉన్నత విద్యను అవకాశాలు పెంచాలని. అదేవిధంగా డిగ్రీ హానర్స్ విధానాన్ని రద్దు చేయాలి విద్యార్థులకు కోర్స్ ఎంపిక చేసే హక్కులను కాలరాస్తుందని పరీక్షా విధానం అంతా గందరగోళం ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్న సంక్షేమ హాస్టళ్లు రోజురోజుకు దిగజారుతుంది.సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువు పేరుతో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డగోళంగా వేల,లక్షల రూపాయలు దోచుకుంటున్నాయని వారన్నారు.కొన్ని సంక్షేమ వసతి గృహాలు సొంత భవనాలు ఉన్న కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. చాలావరకు అద్దె భవనాల్లో హాస్టల్లో ఉంటున్నారని వారికి ఎలాంటి ప్రభుత్వం మోసం చేస్తుందని వారన్నారు. ఈ విధంగా ఉంటే విద్యార్థులు విద్యకు దూరమవుతారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి వారు అన్నారు. అదేవిధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల పై చెరుకులోనే నీట్ పేపర్ లీక్ కావడం జరిగింది. 12 సంవత్సరాల కాలంలో 89 సార్లు నీటి పేపర్ లీకేజీ కావడం దుర్మార్గమైన విషయం ఎవరైతే కారకులు ఉన్నారో వాటి పైన వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసేదాకా పోరాటాలు ఆపమని వారన్నారు. అనంతరం కడప నగర నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా నవీన్, అఖిలేష్ ,నగర ఉపాధ్యక్షులుగా మనోహర్, హరి, ఓంకార్, నాని సహాయ కార్యదర్శులుగా కార్తీక్, నరేంద్ర, సిద్దు, కే కార్తీక్, నగర కమిటీ సభ్యులుగా ఆనంద్, చందన్ కుమార్, వెంకటేష్, విష్ణు, మల్లికార్జున, విక్రమ్, అవిలాస్ మొత్తం 17 మంది సభ్యులతో నూతన నగర కమిటీ ఎన్నుకోవడం జరిగిందని. వారన్నారు
ఈ విధంగా నవీన్, అఖిలేష్ మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి నూతన నగర అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నుకున్నందుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.