📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఇస్కాన్ సైబరాబాద్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి...

ఇస్కాన్ సైబరాబాద్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర లో అరికపూడి గాంధీ

📰 Generate e-Paper Clip

ఇస్కాన్ సైబరాబాద్ హరే రామ హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర లో అరికపూడి గాంధీ

 

శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్: జూలై 16(ప్రజావాణి) నల్లగండ్ల నుండి గోపన్ పల్లి వరకు రథయాత్ర జరిగింది. ఇస్కాన్ ప్రతినిదు లతో పాటు స్తానిక శాసన సభ్యులు పి ఏ సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇస్కాన్ (ISKCON) రథ యాత్ర అనేది జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రల పూజల కోసం నిర్వహించే ఒక వైభవోపేతమైన ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ వేడుకల్లో భాగంగా అలంకరించిన భారీ రథాలను భక్తులు వీధుల్లో లాగుతూ భజనలు, సంకీర్తనలు చేస్తారు

రథయాత్ర యొక్క రహస్య హృదయం.చాలామందికి రథయాత్ర ఒక గొప్ప రథయాత్రగా కనిపిస్తుంది. అయితే, గౌడీయ వైష్ణవులకు ఇది దైవిక ప్రేమ మరియు విరహం (విప్రలంబ-భావం) యొక్క అత్యున్నత వ్యక్తీకరణకు ప్రతీక. రథాన్ని లాగడం యొక్క ఆధ్యాత్మిక అర్థం

జగన్నాథుని రథపు తాళ్లు, భగవంతుడిని మన జీవితాల్లోకి ఆహ్వానించాలనే మన హృదయపూర్వక కోరికకు ప్రతీకగా నిలుస్తాయి.

భక్తులు భక్తితో రథాన్ని లాగుతూ, జగన్నాథ స్వామి సమస్త అడ్డంకులను తొలగించి, వారి హృదయాలను పవిత్రపరిచి, కృష్ణ చైతన్యం మరియు ప్రేమపూర్వక భక్తి సేవ ద్వారా వారిలో తనను తాను సుస్థిరంగా స్థాపించుకోవాలని పిలుపు ఇచ్చారూ

ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, దూబే, అనిల్, ప్రభాకర్ రెడ్డి, మరియు ఇస్కాన్ ప్రతినిధులు తదితరలు పాల్గొనారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.