📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కీలకం

ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కీలకం

📰 Generate e-Paper Clip

 

గోదావరిఖని: ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా అప్లికేషన్లలో మరింత ఖచ్చితత్వాన్ని సాధించవచ్చని కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. బి. రమ అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మూడు రోజుల పైథాన్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్యార్థులు కృత్రిమ మేధస్సు, నాలెడ్జ్‌ను అనుసంధానం చేసుకుంటూ మెషిన్ లెర్నింగ్‌పై పట్టు సాధించాలని సూచించారు. వివిధ మోడళ్లను రూపొందించి సమగ్ర సమాచారాన్ని పొందుపరచడం ద్వారా అప్లికేషన్లలో ఖచ్చితమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. వర్క్‌షాప్‌లు, సెమినార్లతో పాటు NIT, IIT వంటి ప్రీమియర్ సంస్థలు అందించే ఇంటర్న్‌షిప్‌లలో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.

వర్క్‌షాప్ రెండో రోజు HBIC సొల్యూషన్స్ ఫౌండర్, సీఈఓ పల్లెల కమలాకర్ రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని విద్యార్థులకు హ్యాండ్స్‌ఆన్ ప్రాక్టీస్ ద్వారా సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుల్తానాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్‌లలో HBIC సొల్యూషన్స్ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.

మూడు రోజుల వర్క్‌షాప్‌లో రెండు కళాశాలలకు చెందిన 60 మంది విద్యార్థులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జై కిషన్ ఓఝా, వైస్ ప్రిన్సిపల్ ఏ. సాంబశివరావు, వర్క్‌షాప్ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ బి. తిరుపతి, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు డా. వి. నరేష్, డా. ఏ. స్రవంతి పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.