📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅన్నోజిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం – నూతన డైరీ ఆవిష్కరించిన శ్రీకాంత్...

అన్నోజిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం – నూతన డైరీ ఆవిష్కరించిన శ్రీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 18: లయన్స్ క్లబ్ ఆఫ్ దిల్‌సుఖ్‌నగర్ ఆధ్వర్యంలో అన్నోజిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వైద్యులు అవసరమైన సూచనలు అందించారు.

పాఠశాల లో నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీం రేవంతన్న రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి హాజరై నూతన డైరీని ఆవిష్కరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులకు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య శిబిరం మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.