📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliసుందిల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీలో నయాజోష్

సుందిల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీలో నయాజోష్

📰 Generate e-Paper Clip

సుందిల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీలో నయాజోష్


రామగిరి మండలంలోని సుందిల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది.తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ సహకారంతో రామగిరి మండల పార్టీ అధ్యక్షుడు రోడ్డ బాపు, రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేశ్వర్ రావు,రామగిరి మాజీ ఎంపీపీ అరేల్లి దేవక్కా కొమురయ్య గౌడ్,తాజా మాజీ ఎంపీటీసీ జనగామ హేమలత బుచ్చి బాబు,గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ జనగామ సదానందం,దేవాలయ చైర్మెన్ కోర కొప్పుల సత్యనారాయణ గౌడ్,మందల పాపిరెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు జనగామ కృష్ణస్వామి,యూత్ కాంగ్రెస్ నాయకుడు ఈగ ప్రశాంత్,ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం,గ్రామస్థాయిలో కార్యకలాపాల విస్తరణ లక్ష్యంగా చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా యువ నాయకుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్ గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ తాజా మాజీ నాయకులు, కార్యకర్తలు ప్రవీణ్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా అభినందించారు. పార్టీ పదవుల్లో యువతకు పెద్దపీట వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోందని నాయకులు పేర్కొన్నారు.యువత శక్తి, సేవా దృక్పథంతో గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబులకు, మండల,గ్రామ,పార్టీ ఉన్నత నాయకత్వానికి,గ్రామ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామంలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగుతానని చెప్పారు. సుందిల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజలకు చేరువ చేస్తూ,గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. గ్రామశాఖ అధ్యక్షుడి ఎన్నికలో నాతోపాటు అధ్యక్షుడి పదవి ఆశించి నాకు మద్దతు తెలిపిన గడ్డం సదానందం,తాటి సమ్మయ్య గౌడ్,దాసరి పృధ్వీ,అనవేన సంపత్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు,దేవాలయ పాలక మండలి సభ్యుడు రేకుంట్ల రవి,నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు,యువత,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.