📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్సమాజాన్ని మేల్కొల్పే దిశగా సాహిత్య ప్రక్రియ జరగాలి

సమాజాన్ని మేల్కొల్పే దిశగా సాహిత్య ప్రక్రియ జరగాలి

📰 Generate e-Paper Clip

సమాజాన్ని మేల్కొల్పే దిశగా సాహిత్య ప్రక్రియ జరగాలి.

కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాల ట్రస్టు  వ్యవస్థాపకురాలు డాక్టర్ రామలక్ష్మి.

జీడి నెల్లూరు జూన్ 12 ప్రజావాణి: గంగాధర నెల్లూరు మండలంలోని,నెల్లేపల్లి పంచాయతీ లో అప్పిరెడ్డి కండ్రిగ నందు ఉన్న శ్రీ రామలక్ష్మి గార్డెన్ నందు రిటైర్మెంట్ హోమ్ శ్రీ నిలయంలో కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాల ప్రధానోత్సవ ట్రస్టు అధ్యక్షురాలు రోజా ప్రియ గారి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10 గంటలకు  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కుప్పం రెడ్డమ్మ ట్రస్టు వ్యవస్థాపకరాలు డాక్టర్ రామలక్ష్మి మాట్లాడుతూ వర్తమాన సమాజంలో మానవతా విలువలు, కుటుంబ అనుబంధాలు, అనురాగ ఆప్యాయతలు, నశించిపోతున్నాయని నేటి యువత పెడ ధోరణులతో  దుర్వేసనాలకు చెడు అలవాట్లకు, లోనై విచక్షణ కోల్పోయి వారి బంగారు భవిష్యత్తు జీవితం నాశనం చేసుకుంటారని, రచయితలు సమాజాన్ని మేల్కొల్పే దిశగా సాహితీ ప్రక్రియ రచనలు చేయాలని మేధావులు, సమాజసేవకులు ఉపాధ్యాయులు, సమాజ సేవా భావంతో యువతను సాహిత్యం పట్ల, సేవా భావం పట్ల, ఆసక్తి కలిగే విధంగా చైతన్య పరచాలని ఆమె తెలిపారు. అనంతరం కుప్పం రెడ్డమ్మ కార్యక్రమంలో జాతీయస్థాయి పోటీలో ఉత్తమ నవలలుగా విజయతలైన ముగ్గురు ఎంపిక కావడం జరిగింది. వీరిలో మొదటగా, అనగనగా ఒక గ్రామం.. అవధానుల విజయలక్ష్మి  విశాఖపట్నం నగరానికి చెందినవారు, రెండవదిగా విశ్వశాంతి నికేతన్… సుగుణ రావు విశాఖపట్నం నగరానికి చెందినవారు, మూడవదిగా ప్రేమలు తటవర్తి నాగేశ్వరి, ఏలూరు నగరానికి చెందినవారు, వీరికి ఒక్కొక్కరికి 10, 000 రూపాయలు చొప్పున నగదు జ్ఞాపిక శాలువ మరియు గిఫ్ట్ బాక్స్ లతో ముగ్గురిని ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 ప్రక్రియలలో విజేతలైన1. చందోబద్ధ కవిత్వం.. కవన దాస శతకం.. డాక్టర్ గాలి గుణశేఖర్ తిరుపతి. 2. వచన కవిత్వం… సంధ్య సమీరాలు.. సంధ్యా శర్మ చిత్తూరు.3. కథలు.. యద్భావం తద్భవతి.. ఆర్.సి కృష్ణ స్వామి రాజు,తిరుపతి.4. నవల.. జీవితం ఒక పయనం… జిల్లెల్ల బాలాజీ, తిరుపతి. వీరి నలుగురిని ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున నగదు, జ్ఞాపిక, శాలువ గిఫ్ట్ బాక్స్ లతో ఘనంగా సన్మానించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ జీడి నెల్లూరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న తల్లులు లేని శ్రీజ 10, మౌనిక 9, స్నేహ 9, తరగతి అమ్మాయిలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు వితరణగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కట్టమంచి బాలకృష్ణారెడ్డి ఎం.ఆర్ అరుణకుమారి, డా.నిరంజన్ రెడ్డి, సహదేవ నాయుడు,పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తరిమెల అమర్నాథ్ రెడ్డి, కవిత శ్రీ సీతారామయ్య, వేంపల్లి అబ్దుల్ ఖాదర్ హరి నాయుడు బాలసుబ్రమణ్యం, మురిసెట్టి గోవింద్,మోహన, శేఖర్, డాక్టర్ మౌని ఉషారాణి, నాగిరెడ్డి, సీఎం చంద్రశేఖర్, శాంతా భాస్కర్, మిట్టాలక్ష్మీ, సీనియర్ లైన్ మెంబర్ మిట్టామహేంద్ర, అనంత కుమార్, పరంధామ, పిల్లాయి విజయ్ కుమార్, రామిరెడ్డి, మాధవ, తదితర రచయితలు కవులు మరియు రామలక్ష్మి నర్సింగ్ హోమ్ శ్రీ నిలయం సిబ్బంది అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.