📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్శంఖవరం ఆధ్యాత్మిక వైభవానికి సాక్ష్యంగా మహోత్సవ వేడుకలు.

శంఖవరం ఆధ్యాత్మిక వైభవానికి సాక్ష్యంగా మహోత్సవ వేడుకలు.

📰 Generate e-Paper Clip

కలసపాడు జూన్ 7 ప్రజావాణి మండలం,శంఖవరం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి,శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ ధ్వజస్థంభం,కళశం,పోలేరమ్మ, పోతురాజు స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో,ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించబడి 41 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కలసపాడు మండల YSRCP యువ నాయకులు శ్రీ దేశాయి చరణ్ రెడ్డి మరియు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు,YSR కడప జిల్లా పార్లమెంట్ సభ్యులు,మన ప్రియతమ నాయకులు శ్రీ Y S అవినాష్ రెడ్డి,బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ దాసరి సుధా,బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,అలాగే నియోజకవర్గానికి చెందిన పలువురు YSRCP ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి,భక్తిశ్రద్ధలతో తీర్థ ప్రసాదములు స్వీకరించారు.అనంతరం శ్రీ దేశాయి చరణ్ రెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఆధ్యాత్మికత,సంప్రదాయం, ప్రజల ఐక్యతకు ప్రతీకగా శంఖవరం మహోత్సవం చిరస్మరణీయంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.