📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రెండు చుక్కలు.. జీవితాంతం రక్షణ – గుగ్గిళ్లలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన...

రెండు చుక్కలు.. జీవితాంతం రక్షణ – గుగ్గిళ్లలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన — సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూన్ 28(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అప్పుడే పుట్టిన శిశువు నుంచి 0-5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కల్పిస్తాయని, ఆరోగ్యవంతమైన జీవితానికి పోలియో చుక్కలు అవసరం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సులోచన, అంగన్‌వాడీ టీచర్ శోభ, ఆశా వర్కర్ రజిత,సీత శ్రీకాంత్,గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.