📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మహర్షి హైస్కూల్లో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

మహర్షి హైస్కూల్లో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (ప్రజావాణి జూన్ 20) పోరుమామిళ్లలోని శ్రీ మహర్షి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ యువాచార్య భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు చందులూరి బ్రహ్మయ్య పి.ఈ. టి లు షరీఫ్,శైలజ, స్కూల్ ఇన్చార్జి పి.ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్లు బి. గురు మోహన్, బి.బాలభాస్కర్లు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి విద్యార్థిని,విద్యార్థులకు నిత్యవసరమని మారుతున్న సామాజిక పరిస్థితులలో మంచి క్రమశిక్షణ,నైతికత, ఏకాగ్రత సాధించాలంటే యోగా అనేది తప్పనిసరి అని అన్నారు. ధ్యానం వల్ల ప్రతి విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడమే కాకుండా జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు మెరుగుగా ఉన్నాయన్నారు.ప్రతిరోజు యోగ సాధన చేస్తూ విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను సాధించాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఎం. బాల ఓబయ్య మాట్లాడుతూ యోగ సాధన ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ,జీవన కలను నేర్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ఇంచార్జ్ పి. సుదర్శన్ రెడ్డి విద్యార్థిని,విద్యార్థులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.