📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భూ పోరాటాలకు అధ్యుడు, సీపీఐ అగ్రనేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా నివాళి

భూ పోరాటాలకు అధ్యుడు, సీపీఐ అగ్రనేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా నివాళి

📰 Generate e-Paper Clip

బేతంచర్ల (జూన్ 06) ప్రజావాణి పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు మండల కార్యదర్శి భార్గవ్ అధ్యక్షతన భూ పోరాటయోధుడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి అనంతరం మాట్లాడుతూ.కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు పేరు చెప్పగానే భూమికోసం,భుక్తి కోసం,శ్రమజీవుల అభ్యున్నతి కోసం జరిగిన అనేక పోరాటాలు ఉద్యమాలు గుర్తుకు వస్తాయి ఆయన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన, తండ్రి ధనిక భూస్వామి అయినా కామ్రేడ్ రాజేశ్వరరావు ఒక సాధారణ వ్యక్తిగా నిరాడంబరంగా నిబద్ధతగల కమ్యూనిస్టుగా తన యావత్ జీవితాన్ని పేదల పోరాటాలకు అంకితం చేశారన్నారు,1914 జూన్ 6న దివిసీమలోని,మంగళాపురం గ్రామంలో జన్మించిన చండ్ర రాజేశ్వరరావు భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడిగా,అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖ నాయకులుగా గుర్తింపు,గౌరవం పొందారన్నారు,భూస్వాములను,జమీందారులను ఎదిరించి భూమిలేని పేదల పక్షాన నిలిచి భూమిలేని పేదలలో పేదగా రైతులు ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేశారని పేదల హక్కుల కోసం జరిగే పోరాటంలో తెగింపుగా అక్రమాలను,అన్యాలను ఎదిరించి నిలబడ్డారన్నారు,సామాజిక అంశాలలో లోతైన ఆలోచనతో సంయమనంగా వ్యవహరించే వారని,స్వగ్రాపం మంగళాపురం అటవీ భూమిగా ఉన్న 5000 ఎకరాల భూమిని జమీందారులు అమ్ముకుంటుంటే దానిని ప్రతిఘటించి గ్రామంలోని పేదలకు ఆ భూమి దక్కేవరకు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు పోరాటాన్ని నిర్వహించారు. స్వగ్రామంలో ప్రారంభించిన భూ పోరాటాన్ని కృష్ణాజిల్లా అంతట మునగాల పరగణాలోను తర్వాత కాలంలో దేశవ్యాప్త భూ ఆక్రమణ ఉద్యమంగా మలిచిన మహానాయకుడు చండ్ర రాజేశ్వరరావు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 1969—70 ప్రాంతంలో దేశవ్యాప్త భూ పోరాటానికి నాయకత్వం వహించారని టాటాలు బిర్లాలు వంటి పారిశ్రామిక దిగ్గజాల ఆక్రమణలో లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించడం,వేలాది మందిని అరెస్టులు జరిగిన లెక్కచేయకుండా భూ సమస్యను నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం గుర్తించేటట్లు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు.రాజేశ్వరరావు పోరాట పటిమ పట్ల నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం అనేక రాష్ట్రాలలో భూసంస్కరణ చట్టాన్ని తీసుకు రాగలిగారన్నారు నేటి యువ కమ్యూనిస్టులు ఆయన పోరాట పటిమను వారసత్వంగా చేసుకుని భవిష్యత్తు పోరాటాలకు సమాయత్తం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు భాస్కర్,మధు,ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ప్రదీప్, సిపిఐ నాయకులు ఎల్లకృష్ణ,గౌరీ.ఉదయ్, శ్రీను మనోజ్, గణేష్,సూర్య,మహబూబ్,నాగేంద్ర,బాబు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.