📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్‌లో నడిరోడ్డుపై ప్రజాధనం లూటీ.. పాత డివైడర్‌పైనే కొత్త నాటకం!

బద్వేల్‌లో నడిరోడ్డుపై ప్రజాధనం లూటీ.. పాత డివైడర్‌పైనే కొత్త నాటకం!

📰 Generate e-Paper Clip

వైఎస్ఆర్ కడప జిల్లా జూన్ 26 ప్రజావాణి బద్వేల్ పట్టణంలో ప్రజాధనం నడిరోడ్డుపై నిలువునా లూటీ అవుతోంది. మైదుకూరు రోడ్డు నేషనల్ హైవే 67పై సాగుతున్న డివైడర్ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ బరితెగింపు, అధికారుల అండదండలు క్షేత్రస్థాయి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి, నిబంధనలను నవ్వులపాలు చేస్తూ సాగుతున్న ఈ దోపిడీ
1.కండ్లముందే సాక్ష్యం: పాత డివైడర్‌పైనే కొత్త నాటకం! తొలగింపు లేదు:నిబంధనల ప్రకారం పాత డివైడర్‌ను పూర్తిగా పెకలించి వేసి,పునాది నుండి కొత్త నిర్మాణం చేపట్టాలి.కప్పిపుచ్చే యత్నం:కానీ ఇక్కడ పాత సిమెంట్ బ్లాకులపైనే నేరుగా మట్టిని నింపి,దానిపైనే కొత్తగా సిమెంటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు.డబుల్ బిల్లుల స్కెచ్: పాత నిర్మాణాన్ని కూడా కొత్తగా చూపించి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని డ్రా చేసుకునేందుకే ఈ తరహా మోసపూరిత పనులకు తెరలేపారు.2. నాసిరకం కడ్డీలు – ఇష్టారాజ్యంగా ఐరన్ మెష్ ఫొటోస్ చూస్తే డివైడర్ చుట్టూ అమర్చిన ఐరన్ మెష్ (ఇనుప కడ్డీల వల) ఎంత పలచగా,బలహీనంగా ఉందో అర్థమవుతోంది.జాతీయ రహదారి పై వేగంగా వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోయి ఢీకొడితే,ఈ నాసిరకం డివైడర్ ఏమాత్రం తట్టుకోలేదు.ప్రమాదాలకు పొంచి ఉన్న ముప్పు: నాణ్యత లేని ఇనుము,సిమెంట్ వాడకం వల్ల ఈ నిర్మాణం కొద్ది రోజులకే బీటలు వారి కూలిపోయే ప్రమాదం ఉంది.3.అధికార పార్టీ అండ–అధికారుల ‘మామూళ్ల’ మత్తు సిండికేట్ రాజకీయం:సదరు కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు కావడంతో స్థానిక మున్సిపల్ అధికారులు ఆయన అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారు.కమిషన్ల కక్కుర్తి: గతంలో నెల్లూరు రోడ్డు,మైదుకూరు రోడ్డు పరిధిలో కూడా ఇదే కాంట్రాక్టర్ ఇలాగే నాసిరకం పనులు చేసి,పాత డివైడర్లతో కలిపి బిల్లులు చేయించుకున్నా ఎవరూ చర్యలు తీసుకోకపోవడం అధికారుల అవినీతికి నిదర్శనం.పర్యవేక్షణ శూన్యం: బద్వేల్ పోలీస్ వారి సైన్ బోర్డులు,ప్రజల రాకపోకలు సాగే ప్రధాన కూడలిలోనే ఇంత దారుణంగా పనులు జరుగుతున్నా,క్వాలిటీ కంట్రోల్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీగా మామూళ్లు చేతులు మారాయనే ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి.ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు,అధికారులు కలిసి పంచుకు తింటుంటే చూస్తూ ఊరుకునేది లేదు.అని ప్రజలు అంటున్నారు.ఉన్నతాధికారులు,ఈ పనులపై విచారణ జరపాలి.నాసిరకం పనులను తక్షణమే నిలిపివేసి,పాత డివైడర్‌ను తొలగించి సరికొత్తగా,నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయించాలి.అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్‌ను,లంచాలకు లొంగిపోయిన మున్సిపల్ అధికారులపై చర్యలు ఉంటాయా లేవా అని ప్రజలు వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.