📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రముఖ రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాలకొలను కేశవ నారాయణ రెడ్డి గారికి ఘన నివాళి 🕯️

ప్రముఖ రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాలకొలను కేశవ నారాయణ రెడ్డి గారికి ఘన నివాళి 🕯️

📰 Generate e-Paper Clip

కాశినాయన జూన్ 14 ప్రజావాణి మండలం మిద్దెల గ్రామానికి చెందిన ప్రముఖ రిటైర్డ్ ఉపాధ్యాయులు పాలకొలను కేశవ నారాయణ రెడ్డి, గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర విషాదకరం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్సీ శ్రీ డీసీ గోవిందరెడ్డి,మరియు వారి సతీమణి శ్రీమతి తులసమ్మ మృతుని స్వగృహానికి చేరుకుని పార్ధివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పారు.విద్యా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ హనుమంతు రెడ్డి, పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొని తమ నివాళులు అర్పించారు.🙏 పాలకొలను కేశవ నారాయణ రెడ్డి,ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.ఘన నివాళులు. 🙏

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.