📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyపేదల పెన్నిధి – ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటింటా సౌభాగ్యం కొందుర్గు...

పేదల పెన్నిధి – ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటింటా సౌభాగ్యం కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి

📰 Generate e-Paper Clip

 

రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కొందుర్గు మండల పరిధిలోని వెంకీర్యాల, కొందుర్గు, ఆగిర్యాల గ్రామాల్లో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ జితేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాములు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా కృషి చేస్తోందని తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు.

అనంతరం నూతన గృహాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జహంగీర్, మాజీ ఎంపీటీసీలు మల్లేష్ గౌడ్, వెంకీర్యాల సర్పంచ్ యాదమ్మ, డిప్యూటీ సర్పంచ్ రమేష్ నాయక్, మాజీ సర్పంచ్ లింగం గౌడ్, గుడి చైర్మన్లు రాఘవేంద్ర, కృష్ణయ్య, బోజగారి నర్సింలు, అశోక్, యూనిష్, గోపాల్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రమేష్, రవి, మల్లేష్, నరేందర్ గౌడ్, పద్మయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు బాల్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.