📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నాసిరకం డ్రైనేజీ పనులు: చిన్న వర్షానికే కుంగిన స్లాబ్,విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

నాసిరకం డ్రైనేజీ పనులు: చిన్న వర్షానికే కుంగిన స్లాబ్,విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (జూన్ 06) ప్రజావాణి మండలం రంగసముద్రం పంచాయతీ పరిధిలోని ఐ ఆర్ సి (IRC) లాడ్జ్ ఎదురుగా ఉన్న తిరుమల డైరీ వద్ద నిర్మించిన డ్రైనేజీ కాలువ పనుల నాణ్యత లోపం స్పష్టంగా బయటపడింది. శనివారం కురిసిన స్వల్ప వర్షానికే ఇక్కడి డ్రైనేజీ కాలువపై వేసిన స్లాబ్ పెద్ద గండి పడి కుంగిపోయింది. శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికే స్లాబ్ విరిగిపోయిందంటే,ఈ నిర్మాణ పనులు ఎంత నాసిరకంగా జరిగాయో అర్థమవుతోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదకరంగా మారిన రహదారి:ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతానికి ఈ గండి పడిన చోట బైక్‌లు ప్రయాణిస్తున్నప్పటికీ, భారీ వాహనాలైన ఆటోలు, ట్రాక్టర్లు లేదా లారీలు వెళ్తే గనుక ఈ స్లాబ్ పూర్తిస్థాయిలో విరిగి లోపలికి కుంగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రయాణించే వారికి ఈ గుంత కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు:పోరుమామిళ్ల పట్టణంలో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా,ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా డ్రైనేజీ కాలువలు నిర్మిస్తున్నా,సంబంధిత శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ నాసిరకం డ్రైనేజీ కాలువ నిర్మాణాల వ్యవహారంపై గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పనులపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణకు ఆదేశించి,బాధ్యులైన కాంట్రాక్టర్‌పై మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని,అలాగే యుద్ధప్రాతిపదికన ఈ స్లాబ్‌ను పునర్నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని రంగసముద్రం పంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.- స్థానిక ప్రజలు, రంగసముద్రం పంచాయతీ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.