📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddy*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయండి

*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయండి*

– *షాద్‌నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ పిలుపు*
షాద్ నగర్ ప్రజావాణి జూన్ 13:
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం షాద్‌నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలు జూన్ 14న షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలు, సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడంతో పాటు వ్యవసాయ కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన ఉద్యమాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని శ్రీను నాయక్ వెల్లడించారు.
జిల్లాలోని వ్యవసాయ కార్మికులు, సంఘ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.. *

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.