📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyజోగిపేట మాంసం మార్కెట్‌లో పరిశుభ్రతపై ప్రజల ఆందోళన  అధికారుల తనిఖీ చేయాలనే డిమాండ్

జోగిపేట మాంసం మార్కెట్‌లో పరిశుభ్రతపై ప్రజల ఆందోళన  అధికారుల తనిఖీ చేయాలనే డిమాండ్

📰 Generate e-Paper Clip

జోగిపేట మాంసం మార్కెట్‌లో పరిశుభ్రతపై ప్రజల ఆందోళన – అధికారుల తనిఖీ చేయాలనే డిమాండ్

మన సమగ్ర ప్రజావాణి జూన్ 26 ( జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి



జోగిపేట మాంసం మార్కెట్‌లో పరిశుభ్రత లోపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో మాంసం విక్రయిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాంసం నాణ్యత, పరిశుభ్రత, లైసెన్సులు మరియు నిబంధనల అమలును పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాంసం కొనడానికి వచ్చిన ప్రజలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మేము చనిపోయిన మేకలు గొర్రెలు కోస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాంస విక్రయదారులు చెబుతున్నారు.దీనిపై వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి  మాంసం నాణ్యతగా ఉందా లేదా అని తెలుసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.