📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyజడ్చర్ల సీఎం సభకు కేశంపేట నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

జడ్చర్ల సీఎం సభకు కేశంపేట నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip

*జడ్చర్ల సీఎం సభకు కేశంపేట నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు*
షాద్ నగర్ ప్రజా వాణి జూన్ 05
: జడ్చర్లలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కేశంపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో, మాజీ జెడ్పీటీసీ తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో సభకు బయలుదేరారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు సంఘీభావం వ్యక్తం చేశారు. సభకు వెళ్లిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువత మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.