📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్చెన్నకేశవ కుటుంబాన్ని ఆదుకోవాలి. సిపిఎం డిమాండ్

చెన్నకేశవ కుటుంబాన్ని ఆదుకోవాలి. సిపిఎం డిమాండ్

📰 Generate e-Paper Clip

బ్రహ్మంగారిమఠం జూన్ 14 ప్రజావాణి మండల కేంద్రంలో నివాసము అంటూ చేపల వేట జీవన ఆధారంగా బ్రతికే కందుకూరి పెద్ద చెన్నకేశవ శుక్రవారం నాడు చేపల వేటకు వెళ్లిన నేపథ్యంలో మరణించడం జరిగిందని అతని కుటుంబాన్ని మత్స్యకారుల సంఘం సొసైటీ ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.శనివారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ తో కలిసి మాట్లాడుతూ.చెన్నకేశవ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని అందులో రెండో పాపకు హార్టులో హోల్ ఉందని అదేవిధంగా ఆయన భార్యకు క్యాన్సర్ ఉందని మీరందరు కూడా చెన్నకేశవ చేపల వేటకు వెళ్లడం ద్వారా వచ్చే ఆదాయంతోనే జీవనం గడుపుతున్నారని కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిది అయిందని కుటుంబంలో ఇద్దరు అనారోగ్యంతో ఉండడంతో వారి ఆర్థిక పరిస్థితి, ఇబ్బందికరంగా తయారైందని కావున మత్స్య కార్మికుల సంఘం సొసైటీ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకొని వారి అనారోగ్యానికి మెరుగైన చికిత్స అందించాలని వారి కుటుంబ పోషణకు 25లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందివాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సన గోవింద్,రెబ్బ నరసింహులు, నాయకులు ఎద్దు రాహుల్, అరవింద్, రాజశేఖర్,దేవ,లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.