📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriచెట్ల కొమ్మల తొలగింపు, ఫీడర్ నిర్వహణ పనుల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయం

చెట్ల కొమ్మల తొలగింపు, ఫీడర్ నిర్వహణ పనుల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూన్ 21: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణ కోసం చెట్ల కొమ్మల తొలగింపు, ఫీడర్ నిర్వహణ మరియు లైన్ క్లియరెన్స్ పనులు చేపట్టనున్నందున జూన్ 22 (సోమవారం)న ఘట్‌కేసర్, నారపల్లి విద్యుత్ విభాగాల పరిధిలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ మాధారం ఫీడర్ ద్వారా సరఫరా పొందుతున్న మాధారం గ్రామం, మాధారం ఏజీఎల్, మాధారం పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు,

11 కేవీ ఎన్‌ఎఫ్‌సీ నగర్ ఫీడర్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్, ప్రశాంత్ నగర్, శ్రీనివాస్ నగర్, హేమాద్రి కాలనీ, బొక్కొనిగూడ, పరమేశ్వరి నగర్, దత్తాత్రేయ కాలనీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు,

నారపల్లి సెక్షన్ పరిధిలోని 33/11 కేవీ సింగపూర్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పొందుతున్న 11 కేవీ సింగపూర్–1 ఫీడర్ పరిధిలో సింగపూర్ ఫేజ్–1, సింగపూర్ ఫేజ్–2 తదితర కాలనీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు,

11 కేవీ సింగపూర్–2 ఫీడర్ పరిధిలోని సింగపూర్ ఫేజ్–1, సింగపూర్ ఫేజ్–2 తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగదారులు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకుని సహకరించాలని ఘట్‌కేసర్ సెక్షన్ ఇంచార్జ్ ఏఈ ఎం. ప్రసన్నాంజనేయులు, నారపల్లి ఏఈ హరినాథ్ సగ్గు విజ్ఞప్తి చేశారు. అధికారులు పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. విద్యుత్ అంతరాయానికి చింతిస్తూ, ప్రజలు సహకరించగలరు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.