📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriచెంగిచెర్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎస్. స్వాతి బాధ్యతల స్వీకరణ

చెంగిచెర్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎస్. స్వాతి బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

చెంగిచెర్ల, జూన్ 11: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చెంగిచెర్ల డిపో మేనేజర్‌గా ఎస్. స్వాతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చెంగిచెర్ల డిపో మేనేజర్‌గా విధులు నిర్వహించిన కే. కవిత కంటోన్మెంట్ డిపోకు బదిలీ కావడంతో, ఆమె స్థానంలో జనగామ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్. స్వాతిని నియమించారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వాతి మాట్లాడుతూ, ప్రయాణికులకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ప్రయాణికుల సంతృప్తినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని, డిపో పరిధిలో బస్సుల నిర్వహణ, సమయపాలన, ఆదాయ వృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానన్నారు.

ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. చెంగిచెర్ల డిపోను అన్ని రంగాల్లో ఆదర్శ డిపోగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.

ఈ సందర్భంగా డిపోకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎస్. స్వాతికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నాయకత్వంలో చెంగిచెర్ల డిపో మరింత అభివృద్ధి సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.