📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamకాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా చేస్తే అంతం చేస్తారట

కాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా చేస్తే అంతం చేస్తారట

📰 Generate e-Paper Clip

కాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా చేస్తే.. అంతం చేస్తారట..?

ఊరకుంట తో పాటు చేపల చెరువులో పెత్తనంకు రంగం సిద్ధం

అసలు ఈతరాని వాళ్లకు సభ్యత్వాలు ఎలా ఇచ్చారు..?


మాజీ అధ్యక్షుడు రికవరీపై నోరు మెదపని మత్స్య శాఖ ఏడి

కాంట్రాక్టర్ వ్యవస్థ లేదంటారు.. చర్యలు మరిచిన మత్స్య శాఖ అధికారి


ఎకరాలు దాచిపెడుతున్న నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు.. అక్రమాల మాటున దాగిన నిజాలు ఎన్నెన్నో

మన ప్రజావాణి ప్రత్యేక కథనం 15

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీలో గతంలో జరిగిన అక్రమాలపై జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్ నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం వల్ల మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. గతంలో పనిచేసిన మాజీ అధ్యక్షుడు సుమారు మూడు లక్షల అరవై వేల రూపాయలు నిధులను దుర్వినియోగం చేసి నూతన సభ్యత్వాలు కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి మోసం చేసినట్లు గత సంవత్సరం ఫిర్యాదులు చేసినమాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని తూటిపల్లి వీరభద్రం సింగారపు వీరభద్రం లు అన్నారు. కాగా కాంట్రాక్టర్ వ్యవస్థకు చెక్ పెడుతూ సంఘం అధ్యక్షుడు కార్యదర్శి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఈనాటి వరకు కూడా చర్యలు తీసుకోలేదని పలువురు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పందిళ్ళపల్లి మచ్చ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు స్థానిక చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అధ్యక్ష కార్యదర్శి పై పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన మాజీ అధ్యక్షుడు లింగం వెంకటేశ్వర్లు ఒత్తిడి చేసినట్లు ఆ మేరకు స్థానిక చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం విశేషం

మత్స్య సొసైటీ అధ్యక్ష కార్యదర్శి సాక్షాత్తు పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన దరఖాస్తు మేరకు ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం పట్ల పలు విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా జిల్లా మత్స్య శాఖ అధికారి నిర్లక్ష్యాన్ని వీడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మత్స్యకారులకు న్యాయం చేయాలని పందిళ్ళపల్లి బొప్పారం గాంధీనగర్ కాలనీ అనంతసాగర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.