📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కంపు కొడుతున్న బెస్తవీధి: పట్టించుకోని అధికారులు, రోగాల బారిన పడుతున్న ప్రజలు

కంపు కొడుతున్న బెస్తవీధి: పట్టించుకోని అధికారులు, రోగాల బారిన పడుతున్న ప్రజలు

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూన్ 5 ప్రజావాణి నగర పంచాయతీ పరిధిలోని 13వ వార్డు బెస్తవీధి ప్రజలు తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్నారు.స్థానిక స్టార్ స్కూల్ సమీపంలో,విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరియు పాత పోస్ట్ ఆఫీస్ వీధి ప్రాంతాలు చెత్తాచెదారం,మురుగునీటితో నిండిపోయి తీవ్రంగా కంపు కొడుతున్నాయి.మురుగు కాలువలు సరిగ్గా శుభ్రం చేయకపోవడం,చెత్తకుండీలు లేకపోవడంతో వీధులన్నీ చెత్తమయంగా మారాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం ముంగి ‘విష జ్వరాల’భయం ప్రస్తుతం వర్షాకాల సీజన్ ప్రారంభంవుతుండటంతో ఈ మురుగు, చెత్త కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.చిన్న పిల్లలు,వృద్ధులు ఇప్పటికే అనారోగ్యం బారిన పడుతున్నారని,దోమల కాటుతో రాత్రుళ్లు నిద్రలేని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త తొట్లు ఏర్పాటు చేయాలి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేరుకుపోయిన చెత్తను,మురుగును వెంటనే క్లియర్ చేసి, వ్యర్థాలను వేయడానికి వీధిలో కొత్త తొట్లు (చెత్తకుండీలు) ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.స్పందించకుంటే ఆందోళన తప్పదు
పై అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని బెస్తవీధి ప్రజలు వేడుకుంటున్నారు.ప్రజాప్రతినిధులు,నగర పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే,వార్డు ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.