“ఎట్టకేలకు” డిపిఓ కార్యాలయానికి చేరిన ఎంపీ ఓ నివేదిక
*9 నెలల గ్రీవెన్స్ దరఖాస్తుకు మోక్షం ఎన్నాళ్లకు
*99 రోజుల ప్రణాళికలోను పరిష్కారం కాకపోయే..?
*సీఎం జిల్లా పర్యటన నాటికైనా చర్యలు తీసుకుంటారో… ?లేదో…?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 2009 2010 సంవత్సరంలో ఆ తరువాత 2017 లో ఓ ప్లాటు రేకుల షెడ్డు వ్యవహారంపై గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు నాటి కలెక్టర్కు ప్రజావాణి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాటి డిపిఓ మన ప్రజావాణి ప్రత్యేక కథనాలకు స్పందనగా సుమోటోగా దరఖాస్తును ఫిర్యాదును స్వీకరించి నేటి డిపిఓ రెండు దశల్లో విచారణ చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుత మధిర మాటూరు పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబు వ్యవహరించారని ధ్రువీకరించి స్థానిక చింతకాని ఎంపీ ఓను ఐదు రోజుల్లో నివేదిక అందించాలని ఈ ఏడాది మార్చి నెలలో పలుమార్లు ఆదేశించినప్పటికీ సదరు ఎంపీ ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు జిల్లా స్థాయిలో ఫిర్యాదులు చేసిన వ్యవహారం జిల్లా పాఠకులకు అధికార యంత్రాంగానికి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన ప్రజావాణి ప్రత్యేక కథనాలు అందించిన నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు గత మూడు రోజుల క్రితం విచారణ నివేదికను సదరు ఎంపీ ఓ డిపిఓ కార్యాలయంలో అందజేసినట్లు తెలిసింది. “9 నెలల గ్రీవెన్స్ దరఖాస్తు చింతకానిలో చిక్కుందా..? అనే శీర్షికన వార్త కథనానికి జిల్లా స్థాయి అధికారులు స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు జిల్లాస్థాయి అధికారులు సదరు ఎంపీఓను నివేదిక అందజేయడంలో జాప్యంపై ఇటీవల లిఖితపూర్వకంగా వివరణ కోరినట్లు తెలిసింది. ఈ మేరకు ఎంపీ ఓ పందిళ్ళపల్లి వ్యవహారంలో నివేదికను తయారుచేసి గత మూడు రోజుల క్రితం డిపిఓ కార్యాలయంలో అందజేసినట్లు సమాచారం అందింది. గతంలో అందజేసిన నివేదికలో సాంకేతికపరమైన తప్పులు ఉండటంతో ఓసారి పరిశీలించిన డిపిఓ తిరిగి ఫైల్ ను పంపించినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. కాగా ఎటువంటి లింకు డాక్యుమెంట్లు అనుమతులు లేకుండా సదరు పంచాయతీ కార్యదర్శి ఆ తర్వాత మరో పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించార నే ఆరోపణలు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఇటీవల జిల్లా స్థాయిలో ఓ సమీక్ష సమావేశంలో సైతం పెండింగ్ సమస్యలపై ప్రజల ఫిర్యాదులపై విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పందిళ్ళపల్లి వ్యవహారంలో అందిన నివేదికల ప్రకారం పంచాయతీ కార్యదర్శులు పై చర్యలు తీసుకోవాలని బాధితులు స్థానికులు హక్కుల సంఘాల కార్యకర్తలు కోరుతున్నారు.
ఎట్టకేలకు డిపిఓ కార్యాలయానికి చేరిన ఎంపీ ఓ నివేదిక
RELATED ARTICLES

